పసుపు-కుంకుమ వర్కవుట్ అయ్యింది, 130 సీట్లు పక్కా: పల్లె రఘునాథ్ రెడ్డి

By Nagaraju penumalaFirst Published Apr 18, 2019, 11:02 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీకి 35 లక్షల మంది సభ్యులున్నారని, డ్వాక్రా సంఘాలు 92 లక్షల మంది, పింఛన్‌ లబ్ధిదారులు 60 లక్షల మంది, ఎన్టీఆర్‌ గృహాల లబ్ధిదారులు 11 లక్షల మంది ఉన్నారని వీరిలో ఎక్కువ శాతం మంది తెలుగుదేశంవైపే మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. 
 

అనంతపురం: 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి టీడీపీ సునామీలా దూసుకెళ్లబోతుందని మాజీమంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ టీడీపీ గెలవడం తథ్యమన్నారు. పసుపు-కుంకుమ పథకం వర్కవుట్ అవ్వడంతో టీడీపీ గాలి బాగా వీచిందని చెప్పుకొచ్చారు. 

మహిళలంతా సైకిల్ గుర్తుకు ఓటేశారని చెప్పుకొచ్చారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, సంక్షేమపథకాలే టీడీపీని గెలిపిస్తున్నాయని జోస్యం చెప్పారు. 

తెలుగుదేశం పార్టీకి 35 లక్షల మంది సభ్యులున్నారని, డ్వాక్రా సంఘాలు 92 లక్షల మంది, పింఛన్‌ లబ్ధిదారులు 60 లక్షల మంది, ఎన్టీఆర్‌ గృహాల లబ్ధిదారులు 11 లక్షల మంది ఉన్నారని వీరిలో ఎక్కువ శాతం మంది తెలుగుదేశంవైపే మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. 

ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు పోల్‌ కావడమే తెలుగుదేశం పార్టీ విజయానికి చిహ్నం అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనను విశ్వసించే ప్రజలు మళ్లీ పట్టం కట్టబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే తన నియోజకవర్గంలో పుట్టపర్తి, కొత్తచెరువు, ఓడీసీ, అమడగూరు మండలాల్లో భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సామాజిక వర్గం మాత్రమే పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి అంతా కలిసి పనిచేశారని చెప్పుకొచ్చారు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.  

click me!