జగన్ ఢిల్లీ టూర్ సీబీఐ కేసుల మాఫీ కోసమే : టీడీపీ ఆరోపణలు

By Nagaraju penumalaFirst Published Oct 3, 2019, 2:55 PM IST
Highlights

సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై తెలుగుదేశం పార్టీనేతలు కీలక ఆరోపణలు చేస్తోంది. సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధా విమర్శించారు.  

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈనెల 5న సీఎం వైయస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలతోపాటు, వైయస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరనున్న సంగతి తెలిసిందే. 

అయితే సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై తెలుగుదేశం పార్టీనేతలు కీలక ఆరోపణలు చేస్తోంది. సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధా విమర్శించారు.  

ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలను జగన్‌ కలిసిన ప్రతిసారీ ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు.  

కోర్టులో సీబీఐ చెప్పినట్టుగా జగన్‌ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని అనురాధా ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సహచర నిందితులకు టీటీడీ పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. 

జడ్జీలు సైతం ఆశ్చర్యపోయేంత అవినీతి చేసి తమపై నిందలు వేస్తారా అంటూ మండిపడ్డారు. చిదంబరం బెయిల్‌కు జగన్ కేసుల్ని ఉదాహరణలుగా చెప్పడంపై పంచుమర్తి అనురాధా మండిపడ్డారు. 

click me!