టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత..

Published : Feb 28, 2022, 08:32 AM IST
టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత..

సారాంశం

శతాధిక వసంతాలు పూర్తి చేసుకున్న టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. తన కూతురి నివాసంలో ఆయన సోమవారం మరణించారు.

గుంటూరు : రాజ్యసభ సభ్యులు, టిడిపి సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు (104) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.రైతు నాయకుడుగాను ఆయన సేవలందించారు. సంగం డైరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడిగా ఉన్నారు. తెనాలి సమీపంలోని బోడపాటిలో 1919లో జన్మించారు.

1967,1978లో ఎమ్మెల్యేగా విజయం విజయం సాధించిన ఆయన... 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1983లో టిడిపిలో చేరారు. 1995లో గుంటూరు జడ్పీ చైర్మన్ గా, 1998లో రాజ్యసభ సభ్యుడిగా యడ్లపాటి  వెంకట్రావు ఎన్నికయ్యారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి