వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీ సిద్ధాంతమని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ఉండవల్లి శ్రీదేవి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ ఆమెను దళిత మహిళగా చూపి రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు శ్రీదేవికి కట్టబెట్టి అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీశారని చంద్రబాబు గుర్తు చేశారు.
తాను క్రిస్టియన్ అని, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెప్తే వైసీపీవాళ్ళు దళితమహిళగా రాజకీయం చేస్తున్నారు. తెదేపావారిపై తప్పుడుకేసులు పెడుతున్నారు. ఎస్సీలకు కేటాయించిన అసెంబ్లీ సీటు క్రిస్టియన్ కు కట్టబెట్టి, అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలే నిలదీస్తుంటే మీ జవాబేంటి?
— N Chandrababu Naidu (@ncbn)