అమరావతిని కూల్చేద్దాం... హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం: జగన్‌పై కేశినేని ఫైర్

Siva Kodati |  
Published : Jun 30, 2019, 10:45 AM ISTUpdated : Jun 30, 2019, 10:46 AM IST
అమరావతిని కూల్చేద్దాం... హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం: జగన్‌పై కేశినేని ఫైర్

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. ‘‘ అమరావతిని కూల్చేద్దాం... హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం ’’ అనేలా జగన్ వ్యవహరిస్తున్నారని కేశినేని ఆరోపించారు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని. ‘‘ అమరావతిని కూల్చేద్దాం... హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం ’’ అనేలా జగన్ వ్యవహరిస్తున్నారని కేశినేని ఆరోపించారు.

ఇప్పటికే ప్రజావేదిక కూల్చేశారని.. విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు రద్దయ్యిందని.. ఇదే సమయంలో కేసీఆర్‌‌తో మాత్రం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారని కేశినేని వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం ప్రజావేదిక కూల్చివేతపైనా నాని సెటైర్లు వేశారు.  ఇంకా నయం... తాజ్ మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే’ అంటూ నాని సెటైరికల్‌గా ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు.
 

PREV
click me!

Recommended Stories

వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu
Jogi Ramesh Open Challenge: టైం, డేట్ చెప్పు నేను రెడీ లోకేష్ కి జోగిరమేష్ ఛాలెంజ్| | Asianet Telugu