పవన్‌తో టీడీపీ నేతల భేటీ: జనసేనానికి కేశినేని కంగ్రాట్స్

By narsimha lodeFirst Published Nov 15, 2019, 8:24 AM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కంగ్రాట్స్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు.


విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు విజయవాడ ఎంపీ కేశినేని నాని కంగ్రాట్స్ చెప్పారు.  ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు ఆయనను అభినందించారు. ఈ  పోరాటంలో విజయం కలగాలని నాని కోరుకొన్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యా‌ణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహార్‌లు మూడు రోజుల క్రితం  ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఏపీలో ఇసుక కొరత విషయమై గవర్నర్‌తో సమావేశమయ్యారు.

అదే సమయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసుల విషయమై చర్చించేందుకుగాను టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్ వద్దకు చేరుకొన్నారు.

ఈ సమయంలోనే గవర్నర్ ను కలిసి బయటకు వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతలు మాటలు కలిపారు. ఒకరినొకరు పలకరించుకొన్నారు. కుశల ప్రశ్నలు వేసుకొన్నారు. 

విజయవాడ ఎంపీ కేశినేని నానిని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కు విజయవాడ ఎంపీ కేశినేని కంగ్రాట్స్ చెప్పారు.

Also read:జగన్ రెడ్డి అంటే తప్పేమిటి, నాకే కులం అంటగడుతారా: పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్

తనకు ఎందుకు కంగ్రాట్స్ చెబుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ''2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాల్లో మీరు కొనసాగరేమోనని అనుకున్నా. కానీ గట్టిగా నిలబడ్డారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. మీకు బెస్టాఫ్ లక్.. అందుకే కంగ్రాట్స్ చెప్పాను'' అని నాని వివరించారు. 

మీతో నాకు పరిచయం లేదు. కానీ మీ అన్నయ్య చిరంజీవితో పరిచయం ఉన్న విషయాన్ని నాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.2014 ఎన్నికలకు ముందు కేశినేని నాని టీడీపీలో చేరడానికి ముందు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీని కేశినేని నాని వీడే సమయంలో  చిరంజీవిపై ఆ పార్టీపై నాని తీవ్రమైన విమర్శలు చేశారు.

అక్కడే ఉన్న అఖిలప్రియను చూసిన పవన్‌కల్యాణ్‌ "ఏమ్మా.. ఎలా ఉన్నావ్‌'' అంటూ  పలుకరించారు. అఖిలప్రియ కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి అడిగారుఆళ్లగడ్డ నియోజకవర్గంలో తన కుటుంబంపై పెట్టిన అక్రమ కేసుల గురించి అఖిలప్రియ ఈ సందర్భంగా పవన్ కు వివరించారు. కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ ఆమెకు సూచించారు.

 టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుతోనూ పవన్‌ మాట్లాడారు. ప్రజాసమస్యలపై రామానాయుడు ఉద్యమిస్తున్న తీరుని పవన్ అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలపై రామానాయుడు చేస్తున్న నిరసనలపై ఆయనను అభినందించారు. 

2014 ఎన్నికల సమయంలో జనసేన టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. టీడీపీ అవలంభించిన విధానాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. జనసేన వామపక్షాలతో కలిసి పోటీ చేసింది.


 

click me!