సీఎం జగన్ కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ: సిద్ధంగా ఉన్నానని ప్రకటన

By Nagaraju penumalaFirst Published Jul 9, 2019, 9:40 PM IST
Highlights

రైతుకు నీరిచ్చేందుకు తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో రైతుల సహాయ నిరాకరణతో రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఆ విషయంలో తాను స్వయంగా జోక్యం చేసుకుని రైతులు పెట్టిన కేసులను దగ్గర ఉండి తీసి వేయించినట్లు గుర్తు చేశారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖ రాశారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని కోరారు.  

పోలవరం ప్రధాన కుడి కాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. మోటార్లతో పొలాలకు నీళ్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించాలన్నారు. 

రైతుకు నీరిచ్చేందుకు తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో రైతుల సహాయ నిరాకరణతో రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పనులు నిలిచిపోయాయని తెలిపారు. 

ఆ విషయంలో తాను స్వయంగా జోక్యం చేసుకుని రైతులు పెట్టిన కేసులను దగ్గర ఉండి తీసి వేయించినట్లు గుర్తు చేశారు. కృష్ణా డెల్టాను కాపాడామని వల్లభనేని వంశీ లేఖలో పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ ప్రారంభమైందన్న వంశీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించే ప్రయత్నం చేశారని లేఖలో పేర్కొన్నారు. 

click me!