హలో బ్రదర్ సినిమాలో విలన్‌లా జగన్.. ఏపీలో ప్లాస్టిక్ నిషేధంపై బుచ్చయ్య చౌదరి సెటైర్లు

By Siva KodatiFirst Published Aug 27, 2022, 7:21 PM IST
Highlights

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. జగన్ గారిని చూస్తుంటే హలొబ్రదర్ సినిమా లో విలన్ గుర్తుకు వస్తున్నాడు. అంటూ బుచ్చయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్లాస్టిక్ నిషేధం దిశగా జగన్ ఇచ్చిన పిలుపు వెనుక మరో కారణం వుందంటూ గోరంట్ల సెటైర్లు వేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఉందని ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలొబ్రదర్ సినిమా లో విలన్ గుర్తుకు వస్తున్నాడు. అంటూ బుచ్చయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు. 

కాగా.. శుక్రవారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉండబోవన్నారు. ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసిన ఫ్లెక్సీలనే ఉపయోగించాలని జగన్ కోరారు. తిరుమలలో ప్లాస్టిక్ లేకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని... 2027 చివరి నాటికి  ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా మార్చుతామని సీఎం జగన్ ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అబివృద్దిని సాధించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 

 

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఉందని ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలొబ్రదర్ సినిమా లో విలన్ గుర్తుకు వస్తున్నాడు..!

— Gorantla butchaiah choudary (@GORANTLA_BC)

ALso REad:రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం: విశాఖలో సీఎం జగన్

విశాఖపట్టణంలో పార్లే ఓషన్స్ సంస్థతో కలిసి ప్లాస్టిక్ రహిత సముద్ర తీరం కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం చెప్పారు. పార్లే సంస్థ సముద్రం నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలను బయటకు తీస్తుందని.. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలను రీ సైకిల్ చేసి బూట్లు, గాడ్జెట్స్ వంటి వాటిని తయారు చేయనున్నట్టుగా జగన్ వివరించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్ర జీవరాశులను నాశనం చేస్తున్నాయని .. శనివారం 76 టన్నుల ప్లాస్టిక్ ను సముద్రం నుండి తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకొనే బాధ్యత మనందరిపై ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్ధిక పురోగతి నాణెనికి రెండు వైపు కోణాలని జగన్ చెప్పారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుండే వస్తున్న విషయాన్ని  గుర్తుంచుకోవాలని.. రాష్ట్రంలో 4097 చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.

click me!