ఏపీ బోర్డర్లన్నీ క్లోజ్... రోడ్లపైనే గోడలు కడుతున్న పక్కరాష్ట్రాలు: చినరాజప్ప

By Arun Kumar P  |  First Published Apr 29, 2020, 7:39 PM IST

ఏపిలో  అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కేసులను చూసి పక్కరాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయని మాజీ మంత్రి నిమ్మకాయల రామానాయుడు పేర్కొన్నారు.


కరోనా నివారణకై బాధ్యతాయుత ప్రతిక్షనేతగా చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటే వైసిపి నాయకుల విమర్శలు సరికాదని  మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణలో జగన్ ప్రభుత్వం విఫలమయ్యారని....ప్రక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కరోన కేసులు పెరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. 

ఏపిలో  రోజరోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్నాయని అన్నారు. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తూ జగన్ దీన్ని గమనించి పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు సరిహద్దులలో గోడలు కడుతూ మన రాష్ట్ర పరిస్థితులు చూసి  ఉలిక్కిపడుతున్నారన్నారు. 

Latest Videos

undefined

ఏపిలో కరోణ నివారణపై వైసిపి సర్కార్ ధీమాగా ఉండడం న్యాయమా? అని అడిగారు. ప్రతిపక్ష నేతగా సూచనలు సలహాలు ఇస్తూ ఉంటే జోగి రమేష్ విమర్శించడం న్యాయమేనా? అని  ప్రశ్నించారు. 

రాష్ట్రంలో వరి, కొబ్బరి, అరటి, టమోటా తదితర పంటల ఉత్పత్తులు చేస్తున్న రైతుల పరిస్థితి దారుణంగా మారిందని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని  రైతులకు న్యాయం చేయాలన్నారు.

ఈ విపత్కర సమయంలో నిత్యావసర వస్తువులు ఇవ్వడంలో వేలిముద్రల సేకరణ, షాపుల వద్ద గుమిగూడడం దారుణమన్నారు. కరోన పెరిగే అవకాశాలు ఉన్న కారణంగా నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. 
 

click me!