రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు తనపై మూడు సార్లు దాడుల జరిగాయని చెప్పారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పట్టాబి బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసింది. అయితే రెండు వారాల తర్వాత సోమవారం పట్టాబి మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని అన్నారు. మీడియా ముందు ఏది మాట్లాడిన కూడా డాక్యుమెంట్స్ చేతిలో పట్టుకునే మాట్లాడానని చెప్పిన పట్టాబి.. ఇకపై కూడా వెనకడుగు వేసే సమస్యే లేదని అన్నారు.
నిజాలు మాట్లాడుతున్నామనే, ప్రజలకు వాస్తవాలు చెబుతున్నానని తనపై, టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని పట్టాబి వ్యాఖ్యానించారు.. నిర్భయంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క పసుపు సైనికునికి హ్యాట్స్‌ప్ అని అన్నారు. నిజాయితీ గల నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న పసుపు సైనికుడుగా మాట్లాడతాను.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడ తప్పుజరిగిన.. ఏ స్థాయిలో ఉన్న నాయకుడు తప్పుడు చేసినా నిలదీస్తాను అని చెప్పారు. ప్రజల ముందు వచ్చి ఆధారాలతో మాట్లాడతానని తెలిపారు. ప్రజల సొమ్మును లూటీ చేసే నాయకుల అవినీతిని బయటపెడుతూనే ఉంటానని అన్నారు.
undefined
Also read: కుప్పం : టీడీపీ అభ్యర్ధి కిడ్నాప్ కాలేదు.. వైసీపీది దుష్ప్రచారం, అచ్చెన్న స్పందన ఇదీ
పెట్రోల్, డీజిల్ రేట్ల పేరుతో ఏపీ సర్కార్ వేల కోట్ల దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని విమర్శించారు. తాను పార్లమెంట్‌లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇచ్చిన జవాబు ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. ఏపీలో 2019-20 పెట్రోల్, డీజిల్ విధించిన పన్నుల ద్వారా సమకూర్చుకున్న ఆదాయం.. రూ. 10,168 కోట్లు.. అదే 2020-21లో.. రూ. 11,014 కోట్లు, ప్రస్తుత ఏడాదిలో దాదాపు 7 వేల కోట్ల రూపాయలు అని అన్నారు. పీపీఏసీ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం పెంచిన పన్నులు దేశంలోనే అత్యధిక కాదా..? అని ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో డీజిల్‌పై రూ. 5.48, పెట్రోల్‌పై రూ. 7.59 ధరలు పెంచారా..? లేదా..? అని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
Also Read:కుప్పం : టీడీపీ తరపున బరిలో ఇద్దరు.. ఒకరి అదృశ్యం, చంద్రబాబు పీఏపై అనుమానాలు
ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan) పట్టాబి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఆందోళనలు నెలకొన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొందరు పట్టాభి ఇల్లు, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేశారు. దీంతో పట్టాబికి విజయవాడ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు నవంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పట్టాభి తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే బెయిల్‌పై విడుదలైన పట్టాభి.. ఎక్కడున్నారనే దానిపై కొద్ది రోజులుగా రకరకాల ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ వీడియో విడుదల చేసిన పట్టాభి.. వైసీపీ నేతలు తన ఇంటిపై జరిగిన దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న తన కూతురు మానసిక ఒత్తిడికి గురైందని.. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు ఆమెను తీసుకుని బయటకు వెళ్లానని చెప్పారు.