ఏపీలో కొనసాగుతున్న దాడులు: నిన్న పట్టాబి, నేడు దేవేందర్ రెడ్డి కారు ధ్వంసం

Published : Oct 07, 2020, 01:56 PM ISTUpdated : Oct 07, 2020, 02:04 PM IST
ఏపీలో కొనసాగుతున్న దాడులు:  నిన్న పట్టాబి, నేడు దేవేందర్ రెడ్డి కారు ధ్వంసం

సారాంశం

చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలం కొత్తరమంగళం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.  తన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారు అద్దాలను ధ్వంసం చేయడంపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలం కొత్తరమంగళం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 
తన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారు అద్దాలను ధ్వంసం చేయడంపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

వైసీపీ నేతలే తన కారుపై దాడికి పాల్పడ్డారని  టీడీపీ నేత దేవేందర్ రెడ్డి ఆరోపించారు. దుండగులు వాడిన ఆయుధాలు కూడ వదిలేసిపోయారని  బాధితుడు చెప్పాడు.

విజయవాడలో ఇటీవలనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో పట్టాబి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.ఈ ఘటన మరువకముందే చిత్తూరులో కూడ ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఈ విషయమై బాధితుడు దేవేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా  రాష్ట్రంలో  టీడీపీ నేతల కార్లపై దాడులు చోటు చేసుకోవడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.  ఈ దాడుల వెనుక కుట్రలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu