జగన్ చేతిలో అవమానం...ఏ అఘాయిత్యం చేసుకోకు, విజయసాయి!: అయ్యన్నపాత్రుడు

Arun Kumar P   | Asianet News
Published : May 09, 2020, 12:29 PM ISTUpdated : May 09, 2020, 12:43 PM IST
జగన్ చేతిలో అవమానం...ఏ అఘాయిత్యం చేసుకోకు, విజయసాయి!: అయ్యన్నపాత్రుడు

సారాంశం

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై  టిడిపి నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సెటైర్లు విసిరారు. 

విశాఖపట్నం అంతా తనదేనని గొప్పలు చెప్పుకునే ఎంపీ విజయసాయి రెడ్డి అదే నగర పర్యటనలో సీఎం జగన్ చేతిలో అవమానపడ్డాడని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా  చేశారు. ఇటీవల చంద్రబాబు, లోకేశ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్లపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

''అడిగిన వాడికి, అడగని వాడికి విశాఖ అంతా నాదే అని బిల్డప్ ఇచ్చాడు. కారులోంచి గెంటేయడం హఠాత్ పరిణామమే.ఆయనే లేకుండానే విశాఖలో అన్నీ జరిగిపోవడం తట్టుకోలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడు.ఎవరి పై ఏడవాలో తెలియక చంద్రబాబు గారి నామ జపం చేస్తున్నాడు'' అని విజయసాయి రెడ్డిపై అయ్యన్న ఘాటు విమర్శలు చేశారు. 

''ముందు తాడేపల్లి కలుగులో పబ్జీ ఆడుతున్న ఏ1 ని నిద్రలేపు ప్రజలంతా బీచ్ రోడ్డులో పడుకుంటున్నారు సాయిరెడ్డి.నీ ట్వీట్లు చూస్తుంటే జగన్ కి చేతకాదు రావాలి బాబు గారు,కావాలి బాబు గారు అన్నట్టు ఉంటున్నాయి'' అని ఎద్దేవా చేశారు. 

''ఇంతకీ నువ్వేక్కడ ఉన్నావు. కారు దించేసారు అన్నఅవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి'' అంటూ విజయసాయిపై అయ్యన్నపాత్రుడు సెటైర్లు విసిరారు. 

PREV
click me!

Recommended Stories

Seediri Appalaraju Pressmeet: కూటమిపై మండిపడ్డసీదిరి అప్పలరాజు | Asianet News Telugu
ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీ, నన్నయ్య యూనివర్సిటీని సందర్శించిన Minister Nara Lokesh Asianet News Telugu