కరోనా ప్రమాదం పొంచివున్నా... నిండు గర్భిణి అగచాట్లు: చంద్రబాబు సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Jul 28, 2020, 10:42 PM ISTUpdated : Jul 28, 2020, 10:45 PM IST
కరోనా ప్రమాదం పొంచివున్నా... నిండు గర్భిణి అగచాట్లు: చంద్రబాబు సీరియస్

సారాంశం

కరోనా పరీక్షల కోసం నిండు గర్భిణి చిన్న చిన్న పిల్లలను వెంటబెట్టుకుని హాస్పిటల్ ముందు పడిగాపులు కాయాల్సి వచ్చిందని టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు మండిపడ్డారు.

గుంటూరు: కరోనా పరీక్షల కోసం నిండు గర్భిణి చిన్న చిన్న పిల్లలను వెంటబెట్టుకుని హాస్పిటల్ ముందు పడిగాపులు కాయాల్సి వచ్చిందని టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు మండిపడ్డారు. రాజమండ్రిలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై స్పందిస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర  స్వరంతో విరుచుకుపడ్డారు చంద్రబాబు. 

''ఇదో హృదయ విదారక దృశ్యం...పిల్లలతో పాటు ఒక గర్భిణీ మహిళ కోవిడ్_19 పరీక్ష కోసం 5 గంటలు ప్రభుత్వ ఆసుపత్రి బయట వేచి ఉన్న సంఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఇన్ని గంటలు అలా ఆసుపత్రిలో జనం మధ్య ఉంటే మొత్తం ఆమె కుటుంబానికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. జగన్ ప్రభుత్వం తన తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు'' అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు కరోనాకు సంబంధించి వీడియోలతో కూడిన ట్వీట్లు చేశారు చంద్రబాబు. ''ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ  ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతోంది. అలాగే కొన్ని సూచనలు చేస్తోంది. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలి'' అని ట్విట్టర్ ద్వారా తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. 
 
''కరోనాను మొదటి నుంచీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. తీరా తీవ్రత పెరిగాక చేతులెత్తేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలి. అధైర్య పడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం వద్దు'' అని సూచించారు. 

 ''కరోనా విపత్తులో తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలచి విధులు నిర్వర్తిస్తోన్న వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. అలాంటి వారి త్యాగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలి. వారికి తగిన రక్షణ, వారి కుటుంబాలకు భరోసాను ప్రభుత్వం కల్పించాలి'' అని కోరారు.

 ''అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల మంచి కోసమే పనిచేస్తుంది అని చెప్పడానికి కరోనా వేళ పార్టీ శ్రేణులు చేసిన కార్యక్రమాలే నిదర్శనం. ఎంతో బాధ్యతతో, నిబద్ధతతో ఈ కార్యక్రమాలను నిర్వర్తించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు పేరు పేరునా అభినందనలు'' అంటూ వీడియోలను జతచేస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.   

 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu