తణుకు ఎమ్మెల్యేకు కరోనా.. వణుకుతున్న ఏపీ అసెంబ్లీ..

Published : Dec 02, 2020, 11:55 AM IST
తణుకు ఎమ్మెల్యేకు కరోనా.. వణుకుతున్న ఏపీ అసెంబ్లీ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుములి హాజరయ్యారు. 

దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేలలో టెన్షన్‌ మొదలయింది. ఇప్పుడిదే విషయం ఏపీ అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు నిన్న అసెంబ్లీలో కారుమురి నాగేశ్వరరావు ప్రసంగించారు. 

కోవిడ్‌ రావడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వర్‌రావు దూరం కానున్నారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. 

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఏపీని వణికిస్తోంది. ఈ వైరస్‌ తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఏపీలో 8.68 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి.  

దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది.  ఇందులో 8,54,326 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7,427 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?
Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu