చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ, 3 నెలలే: తలసాని

By pratap reddyFirst Published Jan 15, 2019, 5:52 PM IST
Highlights

ఈ ప్రాంతానికి వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు టీడీపీ నాయకులు అన్నారని, కానీ తాను రాజకీయాలే మాట్లాడుతానని తలసాని అన్నారు. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ రెడీగా ఉందని, 3 నెలలే సమయమని ఆయన అన్నారు

భీమవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చేందుకు రిటర్న్ గిఫ్ట్ సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఏపీ ప్రజలు బాగుండాలని తామూ కోరుకుంటున్నామని, అందుకే ప్రత్యేక హోదాకు తాము మద్దతిస్తున్నాఆయన అన్నారు. 

ఈ ప్రాంతానికి వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు టీడీపీ నాయకులు అన్నారని, కానీ తాను రాజకీయాలే మాట్లాడుతానని తలసాని అన్నారు. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ రెడీగా ఉందని, 3 నెలలే సమయమని ఆయన అన్నారు. దేశంలోనే అవినీతిలో ఏపీ నెంబర్‌ వన్‌లో ఉందని ఆరోపించారు. 

24 గంటల విద్యుత్ ఇస్తున్న తమ పరిపాలన గొప్పదా, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ పాలన గొప్పదా అని ఆయన అడిగారు. ఏపీలో గ్రాఫిక్స్‌ ప్రభుత్వం నడుస్తోందని, కమీషన్ల కోసమే పోలవరం చేపట్టారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో తప్పకుండా తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియా సమావేశంలో టీడీపీ పాలనపై విరుచుకపడ్డారు.  

గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయని, తాను టీడీపివాళ్ల లాగా చిల్లర రాజకీయాలు చేయనుని, తప్పకుండా రాజకీయాలు చేస్తామని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఇక్కడ ఆందోళనలు జరిగినప్పుడు తమ పార్టీ ఎంపీ కవిత పార్లమెంట్‌లో మద్దతు పలికారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవనా అని అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు.

click me!