తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Published : Jun 04, 2024, 08:33 AM ISTUpdated : Jun 05, 2024, 08:28 PM IST
తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సారాంశం

 Tadepalligudem assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. వైసిపి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు పోటీచేస్తున్నాడు కాబట్టి సహజంగానే తాడేపల్లిగూడెం ఎన్నికల ప్రక్రియ, ఫలితంపై ప్రజల్లో ఉత్కంఠ వుంటుంది. దీంతో తాడేపల్లిగూడెం ప్రజల తీర్పు కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలే కాదు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. 

Tadepalligudem assembly elections result 2024: తాడేపల్లిగూడెం రాజకీయాలు చాలా విచిత్రంగా వున్నాయి. ఇక్కడ టిడిపి, వైసిపిలే కాదు కాంగ్రెస్, ప్రజారాజ్యం, బిజెపి లకు కూడా గెలిచిన చరిత్ర వుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 1983 నుండి 1999 వరకు ఇక్కడ టిడిపి హవా కొనసాగగా ఆ తర్వాత ఒక్కసారికూడా గెలుపులేదు. 2004 లో కాంగ్రెస్,  2009 లో ప్రజారాజ్యం, 2014 లో బిజెపి, 2019 లో వైసిపి ఎమ్మెల్యేలు గెలిచారు. 

టిడిపి జనసేన బిజెపి పొత్తులో భాగంగా ఈసారి తాడేపల్లిగూడెంలో జనసేన పోటీ చేస్తోంది. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం టికెట్ తనకు దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే ఈలి నాని (వెంకట మధుసూధనరావు) వైసిపిలో చేరారు. ఇలా ఎన్నికల వేళ తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. 
 
తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పెంటపాడు
2. తాడేపల్లిగూడెం
 
తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,08,789
పురుషులు -  1,02,638
మహిళలు ‌-  1,06,133

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.

జనసేన అభ్యర్థి : 

పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకు కేటాయించింది టిడిపి. దీంతో  జనసేన బొలిశెట్టి శ్రీనివాస్‌ ను బరిలోకి దింపింది. 
 
తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలుచుకుంది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై జేఎస్పీ నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ 62,998 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు
 

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,67,761 (80 శాతం)

వైసిపి - కొట్టు సత్యనారాయణ - 70,741 ఓట్లు (42 శాతం) - 16,466 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - ఈలి వెంకట మధుసూధనరావు (నాని)  - 54,275 (32 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - బొలిశెట్టి శ్రీనివాస్ - 36,197 (21 శాతం) - ఓటమి
 

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,56,918 (81 శాతం)

బిజెపి - పైడికొండల మాణిక్యాలరావు - 73,339 (46 శాతం) ‌- 14,073 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - తోట పూర్ణగోపాల సత్యనారాయణ - 59,266 (37 శాతం) - ఓటమి 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు