టీడీపీకి షాక్: అమరావతి స్కాంపై సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆదేశాలు కొట్టేసిన సుప్రీం

By narsimha lodeFirst Published May 3, 2023, 11:07 AM IST
Highlights

అమరావతి సహా   ఇతర కుంభకోణాలపై  ఏపీ ప్రభుత్వం దాఖలు  చేసిన సిట్ పై   ఏపీ హైకోర్టు  ఆదేశాలను  సుప్రీంకోర్టు   కొట్టివేసింది.  


న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి  ఊరట లభించింది. అమరావతి భూకుంభకోణం సహ ఇతర  అవకతవకలపై  సిట్ ఏర్పాటు పై  ఏపీ హైకోర్టు  ఇచ్చిన స్టేను  సుప్రీంకోర్టు  కొట్టివేసింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  చంద్రబాబునాయుడు  ఉన్న సమయంలో తీసుకున్న   నిర్ణయాలపై విచారణకు  సిట్ ను  జగన్ సర్కార్ ఏర్పాటు  చేసింది.  జగన్ సర్కార్  సిట్ ఏర్పాటును నిరసిస్తూ  టీడీపీ నేతలు వర్లరామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లు  ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు  2022 సెప్టెంబర్ 15న  స్టే విధిస్తూ  ఆదేశాలు  జారీ చేసింది.

సిట్ దర్యాప్తుపై  ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని  సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం  2022 నవంబర్ మాసంలో  సవాల్  చేసింది.  ఈ విషయమై  ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు  ఇవాళ తీర్పును వెల్లడించింది.   గత ప్రభుత్వ నిర్ణయాలపై  సమీక్ష జరపవద్దంటే  ఎలా అని  సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  ప్రాథమిక దర్యాప్తులోనే  దర్యాప్తును  అడ్డుకోవడం సమంజసం కాదని  సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  మెరిట్ ప్రాతిపదికన కేసు విచారణ చేపట్టాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం  సూచించింది. ఈ విషయమై  విచారించి తుది నిర్ణయాన్ని  వెలువరించాలని  హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు

Latest Videos

సిట్  ఏర్పాటుపై  ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను  ఏపీ హైకోర్టు తప్పుగా  అన్వయించుకుందని  సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.   సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం   ఈ తీర్పును వెలువరించింది.

click me!