స్కూల్ పిల్లలతో జగనన్న డ్యాన్స్ వీడియో హల్ చల్: నెటిజన్ల ట్రోలింగ్

Published : Dec 03, 2019, 05:58 PM IST
స్కూల్ పిల్లలతో జగనన్న డ్యాన్స్ వీడియో హల్ చల్: నెటిజన్ల ట్రోలింగ్

సారాంశం

సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన చెయ్యనిపనికి అభాసుపాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కూల్ విద్యార్థులు జగనన్న అనే పాటకు డాన్స్ వేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. 

విజయవాడ: సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన చెయ్యనిపనికి అభాసుపాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కూల్ విద్యార్థులు జగనన్న అనే పాటకు డాన్స్ వేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. 

పిల్లి వెంకట్ విజయవాడ తూర్పు అనే అకౌంట్ నుంచి అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం ఆనందం లో చిన్నారులు అని పేర్కొంటూ ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని భావి అనే ట్విట్టర్ హేండిల్ నుంచి ఈ విడియోలోనుంచి కొంత భాగం పోస్ట్ చేయడం జరిగింది. 

వెంటనే కింద రెప్లైలలో ఇంత ఘోరమా అంటూ నెటిజెన్ల వాపోతున్నారు. మహాల శిశు సంక్షేమశాఖను, మీడియాను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో ఫేకా నిజమా అనేదానిపై ఒకింత చర్చ నడుస్తున్నప్పటికీ వైసీపీ కార్యకర్త నేరుగా పేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇది నిజమే అని అందరూ నమ్ముతున్నారు. ఎక్కడ ఈ సంఘటన జరిగిందనేది ఇంకా తెలియరాలేదు కానీ, ప్రస్తుతానికి ఇది మాత్రం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu