కామంతో కళ్లు మూసుకుపోయి: కూతురి పై సవతి తండ్రి అఘాయిత్యం..!

Published : Apr 17, 2021, 01:06 PM ISTUpdated : Apr 17, 2021, 01:46 PM IST
కామంతో కళ్లు మూసుకుపోయి: కూతురి పై సవతి తండ్రి అఘాయిత్యం..!

సారాంశం

బాలిక తండ్రి చనిపోవడంతో.. తల్లి మరో పెళ్లి చేసుకుంది. అతను.. కూతురులాగా చూడాల్సిన బాలికపై కన్నేశాడు. కొద్ది నెలలుగా... తల్లి చూడకుండా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. 

తల్లి ఇంట్లో లేని సమయంలో... బాలికపై సవతి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడుతూ వచ్చాడు. సవతి తండ్రి పెడుతున్న హింస తట్టుకోలేక పోయిన బాలిక.. తన పక్కింటి పిన్నికి అసలు విషయం చెప్పడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డెంకాడ మండలానికి చెందిన బాలిక(12) ఏడో తరగతి చదువుతోంది. బాలిక తండ్రి చనిపోవడంతో.. తల్లి మరో పెళ్లి చేసుకుంది. అతను.. కూతురులాగా చూడాల్సిన బాలికపై కన్నేశాడు. కొద్ది నెలలుగా... తల్లి చూడకుండా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లితో కూడా బాలిక చెప్పోలేకపోయింది.

ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో.. ఆమె.. పిల్లలను తీసుకొని తన సోదరుడి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో.. బాలిక సవతి తండ్రి తనపై చేస్తున్న  లైంగిక దాడిని పక్కింటి పిన్నికి తెలియజేసింది.

దీంతో.. ఆమె బాలిక తల్లికి అసలు విషయాన్ని చెప్పడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్