ఏపీలో మళ్లీ మొదలైన హిందూ విగ్రహాల ధ్వంసం.. శ్రీకాకుళంలో ఘటన

By Siva KodatiFirst Published Aug 8, 2021, 4:49 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత శ్రీముఖలింగం క్షేత్రం సమీపంలోని పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఇక్కడి వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహిషాసుర మర్దని విగ్రహాలపై దాడులు చేశారు

ఏపీలో కొన్ని నెలల క్రితం సంచలనం సృష్టించిన హిందూ ఆలయాలు, విగ్రహాలపై దాడులు ఇటీవల కాలంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే, ఆ దాడులు మళ్లీ మొదలయ్యాయా అనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ప్రఖ్యాత శ్రీముఖలింగం క్షేత్రం సమీపంలోని పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఇక్కడి వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహిషాసుర మర్దని విగ్రహాలపై దాడులు చేశారు. దీనిని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

click me!