
శ్రీకాకుళం:జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో కుటుంబ కలహలతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సంతబొమ్మాళి మండలంలోని జగన్నాథపురంలో దాసరి సింహద్రి తన భార్య ఉమను హత్యచేసిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదా,న్ని నింపింది. ఈ విషయమై అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మృతుల బంధువులు, స్థానికుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. భార్యను హత్య చేసి తాను చావాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే విషయమై అర్ధం కావడం లేదోనని సింహద్రి బంధువులు చెబుతున్నారు.