జగనన్న నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఆ ఒక్కటే: 19ఏళ్ల యువతి మెుర

By Nagaraju penumalaFirst Published Jul 9, 2019, 8:23 PM IST
Highlights

జగనన్న నా ప్రాణం కాపాడతాడు. నాకు వచ్చిన సివిల్‌ సెల్‌ వ్యాధి నయంకాలేదు. నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఒక్కటే జగనన్నకు నా సమస్య వివరించాలి..’ అంటూ బ్యానర్‌తో పాటు వచ్చిన బాధితురాలు సింధు కలెక్టర్ మురళీధర్ రెడ్డికి తన సమస్య వివరించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. 

కాకినాడ: జగనన్న నా ప్రాణం కాపాడతాడు. నాకు వచ్చిన సికిల్ సెల్ వ్యాధి నయం కాలేదు. నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఒక్కటే జగనన్నకు నా సమస్య వివరించాలి అంటూ 19 ఏళ్ల సికిల్ సెల్ వ్యాధిగ్రస్తురాలు ఆవేదన అందర్నీ కంటతడిపెట్టించింది. 

కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న 19 ఏళ్ల సింధు ఆవేదన అందరి కంట కన్నీరు పెట్టించింది. పిఠాపురంకు చెందిన సి.హెచ్ సింధు 12 ఏళ్ళుగా సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతోంది. 

వ్యాధి నయం కోసం సుమారు 14 ఆస్పత్రులు తిరిగింది. డబ్బంతా ఆస్పత్రులకే దారపోశారు కన్నతల్లిదండ్రులు. కానీ వ్యాధి మాత్రం నయం కాలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం సింధు ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతుంది. 

కన్నకూతురు పరిస్థితి చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. స్పందన కార్యక్రమంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని కుమార్తెను వెంటబెట్టుకుని తల్లిదండ్రులు కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమానికి హాజరయ్యారు. 

మాట్లాడలేని స్థితిలో ఉన్న సింధు తన ఆవేదనను ఒక బ్యానర్ లో పొందుపరచి దాన్ని పట్టుకుని కలెక్టర్ మురళీధర్ రెడ్డిని కలిసింది. జగనన్న నా ప్రాణం కాపాడతాడు. నాకు వచ్చిన సివిల్‌ సెల్‌ వ్యాధి నయంకాలేదు. 

నా చివరి శ్వాస, ఆఖరి కోరిక ఒక్కటే జగనన్నకు నా సమస్య వివరించాలి..’ అంటూ బ్యానర్‌తో పాటు వచ్చిన బాధితురాలు సింధు కలెక్టర్ మురళీధర్ రెడ్డికి తన సమస్య వివరించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. 

సింధు అనారోగ్యంపై గతంలో సంప్రదించిన వైద్యులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మురళీధర్ రెడ్డి. వ్యాధి నయం కావడానికి తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. సీఎం జగన్ ను కలిసే విషయంపై ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. 

అయితే ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని ఆదేశిస్తూ తక్షణం నూరుశాతం అంగవైకల్యం ఉన్నట్లుగా ధ్రువీకరించి రూ. 60వేలు రుణం ఇవ్వాలని కలెక్టర్‌ మురళీధర్ రెడ్డి ఆదేశించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

click me!