వారికోసం చప్పట్లు కొడదాం.. పిలుపునిచ్చిన జగన్..

By AN TeluguFirst Published Oct 2, 2020, 4:17 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయ్యింది. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రజలంతా తమ ఇండ్ల నుండి బైటికి వచ్చి వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని చప్పట్లతో అభినందించాలని పిలుపునిచ్చారు. 

మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం దిశగానే గ్రామ సచివాలయ వ్యవస్థ విజయవంతమైందని చెప్పారు. గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను జగన్ మెచ్చుకున్నారు. 

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం కళ్లెదుటే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటివద్దకే వచ్చి అందుతున్నాయన్నారు. 

పించన్లు, ఇళ్ల నమోదు లాంటి అనేక సంక్షేమ పథకాలు అందరికీ చేరడంలో గ్రామ వలంటీర్లే ముఖ్య పాత్ర పోషించారన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను గుర్తించేలా సాయంత్రం 7 గంటలకు అందరూ చప్పట్లు కొట్టాలని సూచించారు. తాను కూడా సాయంత్రం 7 గంటలకు ఇంటి బయటికి వచ్చి చప్పట్లతో అభినందిస్తానని తెలిపారు. 

సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్నారని వీరిని అభినందిచాల్సిన బాధ్యత మనందరిదీ అని జగన్ పిలుపునిచ్చారు. 
 
click me!