టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు వైసీపీ మార్కు షాక్

Published : Nov 23, 2019, 01:44 PM IST
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు వైసీపీ మార్కు షాక్

సారాంశం

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. గుంటూరు డీడీఆర్సీ సమావేశాలకు నారా లోకేష్ ను ఆహ్వానించకూడదని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలకు (డీడీఆర్సీ) సమావేశాలకు నారా లోకేష్ ను పిలువకూడదని సమావేశంలో తీర్మానం చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను డీడీఆర్సీ సమావేశాలకు పిలువకూడదని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీర్మానం ప్రతిపాదించారు. ఆ తీర్మానానికి మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 

నారా లోకేష్ మంగళగిరి నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!