ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. శానిటైజర్ కలిపిన కల్లీ సారా తాగి ఏడుగురు మరణించారు. లాక్ డౌన్ నేపథ్యంలో మందు లభించక ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఒంగోలు: కరోనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు గ్రామంలో శానిటైజర్ కలిసిన కల్తీ సారా తాగి ఏడుగురు మరణించారు
మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేస్తూ జీవించేవారు కాగా, మరో నలుగురు గ్రామస్తులు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం సరఫరా నిలిపేయడంతో మందబాబులు శానిటైజర్లు తాగుతున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.
undefined
శానిటైజర్ తాగడం వల్ల గొంతు ఎండిపోయి వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. స్థానిక పోలేరమ్మ గుడి వద్ద రేకుల షెడ్డులో ఓ యాచకుడ గురువారం సాయంత్రం మరణించాడు. మరో వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108 వైద్య సిబ్బంది దర్శి వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.
మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.