
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
నారావారిపల్లెలో గ్రామ దేవతను సత్యమ్మ తల్లిని చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, లోకేష్ తదితరులు సందర్శించుకొన్నారు. సత్యమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నారావారిపల్లెలో దేవాన్షు తలానీలాలు సమర్పించిన సమయంలో నాగదేవత శిలను ప్రతిష్టించారు. దీంతో ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం రోజున ఈ రెండు కుటుంబాలు నాగప్రతిమకు పూజలు నిర్వహిస్తుంటారు.
నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబాల సందడి చేస్తున్నాయి. సత్యమ్మ తల్లిని సందర్శించుకొన్న తర్వాత చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళులర్పించారు.
ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు నారావారిపల్లెకు చేరుకొంటారు.