అమరావతి రైతుల మహా పాదయాత్రకు రేణుకా చౌదరి సంఘీభావం..

By AN Telugu  |  First Published Nov 1, 2021, 1:54 PM IST

రైతులు దేశానికి వెన్నెముక అని అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందన్నారు. అమరావతి మహా పాదయాత్రకు Solidarity తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. 


విజయవాడ : ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీకేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఘనస్వాగతం లభించింది. రేణుకా చౌదరిని శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ నేతలు, కొండపల్లి బొమ్మను జ్ఞాపికగా ఇచ్చారు. 

ఈ సందర్భంగా Renuka Chaudhary మాట్లాడుతూ...Amravati Farmers Maha Padayatraకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి వెళ్తున్నానని అన్నారు.

Latest Videos

undefined

రైతులు దేశానికి వెన్నెముక అని అలాంటి రైతులను ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందన్నారు. అమరావతి మహా పాదయాత్రకు Solidarity తెలిపేందుకు వెళుతుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని రేణుకా చౌదరి మండిపడ్డారు. 

నేను సైనికుడి కూతురిని...దేశంలో ఎక్కడైనా పర్యటిస్తా...నాకు భయం అంటే ఏంటో తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.  అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎపుడు మద్దతుగా ఉంటుంది.

అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘం. మహిళల చేతులకు ఉన్నవి గాజులుకావు.. విష్ణు చక్రాలు.. ఓటుతో ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు మహిళలు అని చెప్పుకొచ్చారు. 

రైతులు రోడ్డెక్కే పరిస్థులు తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. సాటి మహిళగా నాకు బొట్టుపెట్టేందుకు మహిళలు వస్తే పోలీసులు అడ్డుకోవడం మంచి పద్దతికాదని హితవు పలికారు.

రేణుకా చౌదరి అమరావతి మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ఏపీ లో గల్లీ... గల్లీ...ఎపుడో తిరిగానంటూ చెప్పుకొచ్చారు. 

అమరావతి రైతుల మహా పాదయాత్ర... ఉద్యమాభివందనాలు తెలిపిన నారా లోకేష్

నేటినుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర.. షరతులివే....

నేటినుంచి అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీవ్రస్థాయిలో ఉద్యమం సాగిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. 

‘‘న్యాయస్థానం టు దేవస్థానం’’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మహా పాదయాత్ర నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు జరగనుంది. దీనికి శనివారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి అనుమతి లభించింది. అయితే ఈ యాత్రకు పోలీసులు కొన్ని షరతులు విధించారు.

షరతులు ఇవే:

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే యాత్ర కొనసాగించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. 

అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొనేవారు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు.

పాదయాత్ర సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని స్పష్టం చేశారు. ఒకటి రెండు పోర్టబుల్ హ్యాండ్ మైకులు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

రైతుల పాదయాత్రకు ఆయా జిల్లాల్లో పోలీసులు రక్షణ కల్పించాలని.. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నగర పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర జరిగినన్ని రోజులు వీడియో చిత్రీకరణ చేయాలని పోలీసులు సూచించారు.  

కాగా.. మహా పాదయాత్రకు తొలుత పోలీసుల అనుమతి కోరారు రైతులు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా మహా పాదయాత్రకు అనుమతివ్వలేమని డీజీపీ gautam sawang అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. దీంతో మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ap high court రైతుల మహా పాదయాత్రకు శుక్రవారం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

click me!