ఎర్ర చందనం స్మగ్లర్ చిట్కా: పాములు దగ్గరికి రావద్దంటే...

By pratap reddyFirst Published Aug 25, 2018, 10:42 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాము కాట్ల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వరదల తర్వాత కేరళలోనూ పాముల బెడద తీవ్రంగానే ఉంది. అయితే, పాములు దగ్గరకు రాకుండా చేయాలంటే ఏం చేయాలో ఎర్ర చందనం స్మగ్లరు వెల్లడించాడు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాము కాట్ల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వరదల తర్వాత కేరళలోనూ పాముల బెడద తీవ్రంగానే ఉంది. అయితే, పాములు దగ్గరకు రాకుండా చేయాలంటే ఏం చేయాలో ఎర్ర చందనం స్మగ్లరు వెల్లడించాడు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని నాగపట్ల ఈస్ట్‌ బీట్‌లో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌ జరిపింది.  శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నంచగా దాదాపు 15 మంది స్మగ్లర్లు అడవుల్లోకి పరారయ్యారు. సిబ్బంది వారిని వెంబడించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 

అదుపులోకి తీసుకున్న వ్యక్తి తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన విజయకుమార్‌గా తెలిసింది. భారీగా వంట సామాగ్రితో పాటు నిమ్మకాయలు, చందనం, కర్పూరం లభ్యమయ్యాయి. చందనం, కర్పూరం కలిపి రాసుకుంటే పాములు దరికి రావని విచారణలో విజయ్ కుమార్ చెప్పాడు.

అడవుల్లో క్రిమికీటకాలు, పాములు దగ్గరికి రాకుండా ఉండాలంటే పూజా సామాగ్రిలోని చందనం, కర్పూరం కలిపి పూసుకుంటామని, ఏమైనా కుట్టినా ఇదే మందు అని చెప్పాడు. 

click me!