పులివెందులలో పెద్దాయన సభ టీజర్ మాత్రమే.. ‘వై నాట్ 175’ అని కారుకూతలు కూసిన వారికి మైండ్ బ్లాంక్...

Published : Aug 04, 2023, 08:17 AM IST
పులివెందులలో పెద్దాయన సభ టీజర్ మాత్రమే.. ‘వై నాట్ 175’ అని కారుకూతలు కూసిన వారికి మైండ్ బ్లాంక్...

సారాంశం

పులివెందులలో పసుపువాన కురిసిందని.. ఇది టీజర్ మాత్రమే అని వైపీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టంరాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

ఢిల్లీ : ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తమ పార్టీపై విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే..  పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ఆందోళన తనలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను వేధిస్తుందన్నారు. పులివెందుల పులి ఇప్పుడు గాండ్రిస్తోందని… భవిష్యత్తులో మ్యావ్ మ్యావ్ అంటూ  పిల్లిగా మారుతుందేమోనని  రఘురామకృష్ణం రాజు వ్యంగంగా వ్యాఖ్యానించారు.

పోలీసులను అడ్డం పెట్టుకొని..  ‘వై నాట్ కుప్పం’ అంటూ తింగరి వేషాలు  వేస్తే..  తోలు తీసే పరిస్థితి వస్తుంది. నిన్నటి పులివెందుల సభ ఈ విషయాన్ని స్పష్టం చేసింది అని చెప్పుకొచ్చారు. గురువారం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సభ టీజర్ తో ‘వై నాట్ 175’ అని కారుకూతలు కూసిన వారికి దిమ్మ తిరిగి ఉంటుంది. 

కాలేజీ నుంచి వస్తున్న లేడీ లెక్చరర్ కళ్లలో కారంకొట్టి, గొంతులో పొడిచి.. దారుణ హత్య...

ముత్యాలముగ్గు సినిమాలో సంగీత లాగా తమ పార్టీకి చెందిన ఓ ఎంపీ…  పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న నాయకులు పసుపు నీళ్లతో పులివెందుల పూల అంగడి ప్రాంగణాన్ని కడిగారు. కడగడం అలవాటైన వారు పులివెందుల పూల అంగడిని కూడా పసుపు నీళ్లతో కడిగారని టిడిపి నాయకుడు బీటెక్ రవి దీటైన సమాధానం ఇచ్చారని రఘురామా అన్నారు.

రఘురామకృష్ణంరాజు ఇంకా మాట్లాడుతూ.. పులివెందులలో పసుపు వాన కురిసింది. పెద్దాయన ప్రసంగం ముగించి వెళ్ళిపోతుంటే అక్కడ జనాలు ఇంకా మాట్లాడాలంటూ  ఆపారు. ‘ఫలానా కుర్రాడు చేసిన హత్య గురించి చెప్పండి. వెళ్లడానికి వీల్లేదు. హత్యానంతరం రక్తపు మరకలు ఎలా కడిగారు చెప్పండి సార్’ అని అడిగి మరీ మాట్లాడించారు. పులివెందుల పూల మార్కెట్లో పసుపచ్చ పూలు చల్లారు. వాటి మీద నుంచే వాహనాలను నడిపించారు.

పులివెందులకు పరదాలు కట్టుకొని స్థానిక ఎమ్మెల్యేలు బితుకు బితుకుమంటూ వెళుతుంటే.. చంద్రబాబు మాత్రం వాహనమెక్కి పులివెందులలో పులిలా ప్రవేశించారు. స్థానిక వైసిపి రౌడీలు ముందుగా ఊహించినట్లుగానే పులివెందుల సభకు ఆటంకం కలిగించారు. వీరిని స్థానికులు తరిమికొట్టారు. ఇది చూస్తుంటే త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశలు చిగురిస్తున్నాయి’ అని అన్నారు.

అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ప్రజాధనాన్ని తెలివినియోగం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!