2024 ఎన్నికలలోపుగా కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. లేకపోతే రాయలసీమ ఉద్యమాన్ని చేపడుతామన్నారు.
కర్నూల్:2024 ఎన్నికల లోపుగా కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది.
ఆదివారంనాడు కర్నూల్ లో రాయలసీమ నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూల్ లో హైకోర్టు భవనాలను నిర్మించాలని డిమాండ్ చేసింది. లేదంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేపడుతామని జేఏసీ తేల్చి చెప్పింది.ఈ డిమాండ్ల సాధన కోసం నవం బర్2న కర్నూల్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టుగా జేఏసీ వివరించింది.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చింది. 2014లో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారు.
ఆ సమయంలో అమరావతిలో రాజధానికి జగన్ కూడా అంగీకరించారని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకురావడాన్ని విపక్షాలు తప్పు బడుతున్నాయి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశ్యంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర సాగిస్తున్నారు. అమరావతి నుండి అరసవెల్లికి రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాభిప్రాయాన్ని వైసీపీ కూడగట్టింది.మూడు రాజధానులు ఏర్పాటు కోరుతూ జేఏసీ ఏర్పాటైంది. ఈ నెల 15 న జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో గర్జన నిర్వహించారు. అయితే ఈ సభలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులపై జనసేన దాడికి దిగింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన తేల్చిచెప్పింది. వైసీపీ శ్రేణులే దాడి చేసి తమపై నెపం నెట్టారని జనసేన వివరించింది. ఈ దాడితో సంబంధం ఉందనే ఆరోపణలపై సుమారు వందమంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.