ప్రభుత్వ ఉద్యోగికి టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు : కేసు నమోదు

By Nagaraju penumalaFirst Published Apr 27, 2019, 8:57 PM IST
Highlights

ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో పోలింగ్ డ్యూటీలో ఉన్న ఉన్న ఉద్యోగిని అంతుచూస్తానని బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే తనను బెదిరించినట్లు డ్వామా ఉద్యోగి రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మురళీకి ఫిర్యాదు చేశారు. 

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగిపై పరుష పదజాలంతో విరుచుకుపడని వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. రాపూర్ పోలీస్ స్టేషన్లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో పోలింగ్ డ్యూటీలో ఉన్న ఉన్న ఉద్యోగిని అంతుచూస్తానని బెదిరించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే తనను బెదిరించినట్లు డ్వామా ఉద్యోగి రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మురళీకి ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్యేపై కేసు నమోదు చెయ్యాలని రాపూర్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్.ఓ సూచనలతో పోలీసులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై కేసు నమోదు చేశారు. 

మరోవైపు బెదిరింపు ఘటనపై రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బెదిరింపుల పర్వంపై సమగ్ర నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది.  

click me!