రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరోసారి పోటీ చేశారు. టీడీపీ నుంచి మిర్యాల శిరీష పోటీ చేశారు. వీరిలో విజయం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో ఈ ఫలితం రాబోతుంది.
Rampachodavaram assembly elections result 2024: 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రంపచోడవరం అసెంబ్లీ ఏర్పడింది. గిరిజన, ఆదివాసి ఓటర్లు ఎక్కువగా కలిగిన నియోజకవర్గం కావడంలో దీన్ని ఎస్టీ రిజర్వుడ్ గా కేటాయించారు. నియోజకవర్గ ఏర్పాటు తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో రంపచోడవరం వైసిపికి కంచుకోటగా మారింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి వంతల రాజేశ్వరిని బరిలోకి దింపి గెలిపించుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగులపల్లి ధనలక్ష్మి గెలిచారు. ఇలా రెండుసార్లుగా రంపచోడవరంలో వైసిపి గెలుస్తూ వస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 2024లో కూడా మహిళా అభ్యర్థులే రంపచోడవరంలో పోటీలో నిలిపారు.
రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. మారేడుమిల్లి
2. దేవీపట్నం
3. వై.రాయవరం
4. అడ్డతీగల
5. గంగవరం
6. రంపచోడవరం
7. రాజవొమ్మంగి
8. కూనవరం
9. చింతూరు
10. నెల్లిపాక
11. వరరామచంద్రపురం
రంపచోడవరం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,60,380
పురుషులు - 1,24,785
మహిళలు - 1,35,585
రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరోసారి పోటీ చేశారు. టీడీపీ నుంచి మిర్యాల శిరీష పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కొత్త అభ్యర్థిని రంపచోడవరం బరిలో దింపింది టిడిపి. మరీ ఈ సారి రంపచోడవరంలో పాగా వేసేది ఎవరనేది కాసేపట్లో తేలబోతుంది.
రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మిరియాల శిరీషా దేవి 9189 ఓట్ల తేడాతో.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై విజయాన్ని అందుకున్నారు
రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,01,807 (77 శాతం)
వైసిపి - నాగులపల్లి ధనలక్ష్మి - 98,318 ఓట్లు - 39,106 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
టిడిపి - వంతల రాజేశ్వరి - 59,212 - ఓటమి
రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,14,978 (76 శాతం)
వైసిపి - వంతల రాజేశ్వరి - 52,156 (45 శాతం) - 8,222 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - సీతంశెట్టి వెంకటేశ్వరరావు - 43,934 (38 శాతం) - ఓటమి