Raghurama Krishnam Raju: వైసీపీ రెబ‌ల్ ఎంపీ పై ఏపీ సర్కార్ సీరియస్.. పరువు న‌ష్టం దావా దాఖాలు !

Published : Mar 23, 2022, 01:23 AM ISTUpdated : Mar 23, 2022, 01:38 AM IST
Raghurama Krishnam Raju: వైసీపీ రెబ‌ల్ ఎంపీ పై ఏపీ సర్కార్ సీరియస్.. పరువు న‌ష్టం దావా దాఖాలు !

సారాంశం

Raghurama Krishnam Raju:  వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పరువు నష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీ రఘురామ చేయించిన మద్యం శాంపిల్స్‌పై ఏపీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.   

Raghurama Krishnam Raju: నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై జ‌గ‌న్ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది ఏపీ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ఆయ‌న ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని, మద్యం శాంపిల్స్ పై కౌంటర్ ఇచ్చారు.  పరీక్షలు చేసిన ఎస్‌జీఎస్ ల్యాబ్ ఇచ్చిన సమాధానం లేఖను రజత్ భార్గవ మీడియాకు విడుదల చేశారు.

ల్యాబ్ కు పంపించిన శాంపిల్స్ ఏపీ నుంచి సేకరించినవే అనడానికి ఆధారాలు లేవు. పరీక్ష చేయటానికి ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఏ నిబంధనను అనుసరించ లేదు. పరీక్ష చేయమన్న వాళ్ళు అడగక పోవటంతో శాంపిల్స్ ను ఐఎస్ నిబంధనల ప్రకారం చేయలేదని ఎస్‌జీఎస్ స్పష్టం చేసింది. 

ఇదంతా ఉద్దేశం పూర్వకంగా చేసిందే  ఏపీ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి రజత్‌ భార్గవ అన్నారు. ఎంపీ రఘురామరాజు చెన్నైలోని ల్యాబ్‌కి పంపించటం వెనుక కారణం ఏంటో తెలియదనీ,  ఎస్‌జీఎస్ తమ లేఖలో శాంపిల్స్‌లో ఏ స్థాయిలో రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయో పరీక్షించలేదని పేర్కొన్నారు.

 తీసుకుని వచ్చిన శాంపిల్స్‌ హానికరం అని ఎస్‌జీఎస్ నివేదిక ఎక్కడా పేర్కొనలేద‌నీ, అలాగే.. హైడ్రాక్సైడ్ ఉండటమే ప్రమాదకరం కాదని అన్నారు, కొన్ని హై రెసుల్యూషన్ పరీక్షల్లో మంచి నీళ్ళు కూడా తాగటానికి హానికరం అని వ‌స్తుంద‌ని, ఎవరైనా పరీక్షలు చేయించవచ్చు…కానీ బీఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా చేయించాలని అన్నారు. ప్రజల్ని తప్పు దారి పట్టించే వారిపై చర్యలు తీసుకుంటామ‌ని రజత్ భార్గవ స్పష్టం చేశారు.

మ‌రోవైపు .. సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. 

సీఎం జ‌గ‌న్ కి  సంబంధించిన క్విడ్‌ ప్రోకో కేసుపై తదుపరి విచారణ చేపట్టాలని రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై సీబీఐ పదేళ్ల క్రితమే విచారణ ప్రారంభించగా.. ఇప్పటికే ఈ కేసులో 11 చార్జిషీట్లు దాఖలు చేసిందన్నారు. వైఎస్ జగన్ కేసులో పలు అంశాలపై ఈడీ, సీబీఐ విచారణ జరపలేదని ఎంపీ రఘరామకృష్ణరాజు పిల్‌లో ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలను దర్యాప్తు సంస్థ విస్మరించిందని.. వాటిపై కూడా విచారణ చేపట్టేలా హైకోర్టు సీబీఐని ఆదేశించాలని కోరుతున్నట్టుగా పిల్‌లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu