అసాని తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర తుఫాన్ నుండి తుఫాన్ గా బలహీనపడినట్టుగా వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
అమరావతి: ఆగ్నేయ Bay of Bengalలోని తీవ్ర తుఫాన్ బలహీనపడి తుఫాన్ గా మారింది.రేపు ఉదయానికి వాయుగుండంగా తుఫాన్ మారనుంది.ఏపీలో చీరాల, బాపట్ల వద్ద Asani Cyclone తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Kakinada కు 180 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. గంటకు 12 కి.మీ వేగంతో తుఫాన్ పశ్చిమ బంగాళాఖాతం వైపునకు దూసుకుపోతోంది. మచిలీపట్టణం, నర్సీపట్నం, యానాం, కాకినాడ, విశాఖ మీదుగా తుఫాన్ పయనిస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అసాని తుఫాన్ ప్రబావంతో Andhra Pradesh రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, యానాం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Meteorological Department అధికారులు తెలిపారు.
అసాని తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. అసాని తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో తీవ్ర అలజడి నెలకొంది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు 3 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి.
తుఫాన్ ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.ఈ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నారు. రాజమండ్రి, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుల నుండి విమానాలను రద్దు చేశారు. ఈ తుఫాన్ ప్రభావంతో రైళ్లు కూడా రద్దయ్యాయి.సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు.
కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 75 నుండి 90 కి. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్ఎప్, మరో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశారు.
అసాని తుఫాన్ ప్రభావంతో Telangana రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది. మరో వైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులను తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ ఇవాళ ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరో వైపు తుఫాన్ పరిస్థితిని ఏపీ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.