ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రదానమంత్రిపై ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. . ఏపీ దేశంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు
న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రదానమంత్రిపై ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. . ఏపీ దేశంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఏపీ ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్షకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు.
ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 12 గంటల పాటు దీక్షకు సోమవారం నాడు న్యూఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీక్ష చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ప్రధానమంత్రి మోడీ అబద్దాలు చెబుతారని రాహుల్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన సమయంలో కూడ మోడీ అబద్దాలు మాట్లాడుతారని ఆయన ఆరోపించారు.
దేశానికి సేవకుడుగా చెప్పుకొనే మోడీ.... దోపీడీకి పాల్పడ్డాడని రాహుల్ ఆరోపించారు. ఏపీ ప్రజల డబ్బులను దోచుకొని అంబానీకి కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు.