ఏపీలో.. ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రమోషన్లు... ఎవరెవరున్నారంటే..

Published : Dec 22, 2022, 07:55 AM IST
ఏపీలో.. ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రమోషన్లు... ఎవరెవరున్నారంటే..

సారాంశం

ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు పదోన్నతులు పొందారు. ముఖ్య కార్యదర్శి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ హోదాల్లో వీరికి ప్రమోషన్లు లభించాయి. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో  పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు ప్రమోషన్లు లభించాయి. వీరిలో నాగులాపల్లి శ్రీకాంత్, ఎంకే మీనా, బి. శ్రీధర్ లు ముఖ్య కార్యదర్శి హోదాలు పొందారు. రేవు ముత్యాలరాజు, బసంత్ కుమార్ సెక్రటరీ హోదా పొందారు. జాయింట్ సెక్రటరీ హోదాలో సుమిత్ కుమార్, వెట్రిసెల్వీ, నిషాంత్ కుమార్, మాధవీ లత,  క్రైస్ట్ కిషోర్ కుమార్, గౌతమి, ప్రశాంతి, విజయ సునీత, అరుణ్ బాబు శ్రీనివాసులు పదోన్నతులు పొందారు.

ఇక అడిషనల్ సెక్రటరీ హోదాలో నారాయణ్ భరత్ గుప్తా, జే.నివాస్, గంధం చంద్రుడు, నాగరాణి ఉన్నారు. జాయింట్ కలెక్టర్ హోదాలో సూర్యసాయి ప్రవీణ్ చంద్, భావన, అభిషేక్, అపరాజిత సింగ్, విష్ణు చరణ్, నిధి మీనన్,  సింహాచలం, వికాశ్ మర్మత్ ఉన్నారు. సీనియర్ ఎస్పీ హోదాలో విజయరావు, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ గున్నిలు ప్రమోషన్లు పొందారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే