ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం: అగ్నికి ఆహుతైన బస్సు

By Nagaraju penumalaFirst Published Jun 6, 2019, 9:24 AM IST
Highlights

ఎల్లో ట్రావెట్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు.

కర్నూలు : అంతా గాఢ నిద్రలో ఉన్నారు. మరికొద్ది గంటల్లో గమ్యానికి చేరుకోబోతున్నారు. ఇంతలో బస్సు వెనుక నుంచి పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. బస్సు డ్రైవర్ చాకచక్యంగా మంటలను గమనించడంతో బస్సును పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దించేశారు. 

ఏం జరగుతుందోనని నిద్రమత్తు నుంచి తేరుకుని చూసే సరికి తాము ప్రయాణిస్తున్న బస్సు బుగ్గిపాలైంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు చెందారు. పాలెం బస్సు ప్రమాదాన్ని తలపించేలా ఈ బస్సు ప్రమాదం క ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే ఎల్లో ట్రావెట్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తుండగా బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి వద్ద బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 

డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించేశారు. ప్రయాణికులు కిందకి దిగిన రెప్పపాటులో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 

బస్సులో ప్రయాణికుల లగేజీ మెుత్తం బూడిదైపోయింది. సుమారు కోటికిపైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్  కారణంగానే ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పిట్ నెస్ లేకపోవడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ట్రావెల్స్ యాజమాన్యంపై మండిపడ్డారు. 

click me!