భార్య కోసం వస్తుండగా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి దారుణ హత్య

Published : Oct 01, 2018, 05:19 PM ISTUpdated : Oct 01, 2018, 05:25 PM IST
భార్య కోసం వస్తుండగా  ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి దారుణ హత్య

సారాంశం

గుంటూరు జిల్లా మాచర్లలో సోమవారం నాడు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని  గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారు.


మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో సోమవారం నాడు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిని  గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించింది.

మృతుడిది  గుంటూరు జిల్లాకు చెరుకుపల్లిగా గుర్తించారు.  ప్రేమ్‌కుమార్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. జైలులో నుండి ఇటీవల విడుదలయ్యాడు.  అయితే వెల్తుర్థి మండలం శిగిరిపాడులో ప్రేమ్ కుమార్ భార్య టీచర్‌గా పనిచేస్తోంది.

సోమవారం నాడు ఆమెను కలుసుకొనేందుకు  వచ్చిన ప్రేమ్‌కుమార్ ను నిందితులు  వెంబడించి చంపారు. ప్రేమ్ కుమార్ బుల్లెట్‌పై వెళ్తుండగా కారులో దుండగలు వెంటాడారు.  నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ప్రేమ్ కుమార్ ను హత్య చేశారు.  అయితే ఈ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం