పోలవరం ప్రాజెక్టు: పనులను పరిశీలించిన పీపీఏ సీఈఓ

By narsimha lode  |  First Published Dec 20, 2020, 1:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని  బృందం ఆదివారం నాడు సందర్శించింది. 


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని  బృందం ఆదివారం నాడు సందర్శించింది. 

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, బ్రిడ్జి గేట్ల ఏర్పాటు,  ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు, ఫిష్ ల్యాడర్  పనులను బృందం సభ్యులు పరిశీలించారు.  ఆర్మ్ గడ్డర్లు, గాప్ 1, గాప్ 2 తదితర పనులను కూడ ఈ బృందం తనిఖీ చేసింది. 

Latest Videos

undefined

పనులను పరిశీలించిన ఈ బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది.  రేపు సాయంత్రం ప్రాజెక్టు తొలి గేటు అమరుస్తున్నామని  ఏపీ నీటిపారుదల శాఖాధికారులు  పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు వివరించారు. 

ప్రాజెక్టు సవరించిన డీపీఆర్‌లను ఆమమోదించాలని ఏపీ ప్రభుత్వం  ఇటీవలనే కేంద్రాన్ని కోరింది. కేంద్ర జల వనరుల శాఖ సవరించిన డీపీఆర్ లను ఆమోదించింది. సవరించిన డీపీఆర్ లకు  కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు  పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ నేతృత్వంలోని బృందం రావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

click me!