ఏపీలో రిజల్ట్స్ పై కాయ్ రాజా కాయ్: ఇదో రకం బెట్టింగ్ చూసి ఉండరేమో...

By Nagaraju penumalaFirst Published May 3, 2019, 6:25 PM IST
Highlights

ఏకంగా బాండ్ పేపర్లమీద రాసి మరీ పందాలు కాస్తున్నారు. ఇలా పందాలు కాస్తు అడ్డంగా బుక్కయ్యారు పందెం రాయుళ్లు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో ఈ పందెంలు జోరుగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బాండ్ పేపర్లు హల్ చల్ చేస్తుండటంతో నిఘా పెట్టారు గుంటూరు పోలీసులు. 

గుంటూరు: ఎన్నికల ఫలితాలపై ఏపీలో బెట్టింగ్ లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఒకటికి రెండు, రెండుకు నాలుగు ఇలా అద్భుతమైన ఆఫర్లతో బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. 

ఇంట్రెస్ట్ లేనివాళ్లను సైతం ఒక్కసారి ఆలోచించండి చిటికెలో లక్షలాది రూపాయలు లేవంటే భూములు మీ ఇష్టం దేనికైనా రెడీ అంటూ ఉత్సాహం పెంచుతున్నారు. ఇవన్నీ నిత్యం జరుగుతున్న పందాలు. కానీ పందెం రాయుళ్లు సరికొత్త రకం బెట్టింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ఏకంగా బాండ్ పేపర్లమీద రాసి మరీ పందాలు కాస్తున్నారు. ఇలా పందాలు కాస్తు అడ్డంగా బుక్కయ్యారు పందెం రాయుళ్లు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో ఈ పందెంలు జోరుగా సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బాండ్ పేపర్లు హల్ చల్ చేస్తుండటంతో నిఘా పెట్టారు గుంటూరు పోలీసులు. 

కచ్చితమైన సమాచారం రావడంతో గుంటూరు అర్బన్ ఎస్పీ ఉత్తర్వులతో నార్త్ డిఎస్పీ సారధ్యంలో పోలీసుల బృందం మంగళగిరి ఆటోనగర్ లోని సహారా హోటల్ పైన గదిలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కాస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

బెట్టింగ్ లో భాగంగా రూ.10 లక్షల నగదు చేతులు మారుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.10.15లక్షల నగదు, 6 సెల్ ఫోన్ లు, ఒక కారు, రెండు బైకులు, మూడు బాండ్ పేపర్లను లను సీజ్ చేశారు. బెట్టింగ్‌లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

click me!