గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి హత్య: లారీలో మనిషి చేయిని తీసుకెళ్తున్న ఇద్దరి అరెస్ట్

By narsimha lode  |  First Published Apr 1, 2021, 8:32 AM IST

గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడి చేయి నరికి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 


గుంటూరు: గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడి చేయి నరికి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.గుంటూరు జిల్లా పెదకాకాని మండలం రామచంద్రపాలెం వెళ్లే  రహదారిలో మొక్కజొన్న తోటలో గుర్తు తెలియని  మృతదేహం బయటపడింది.

మృతుడి ఎడమ చేయి మోచేతి వరకు నరికి ఉంది.  మొక్కజొన్న తోటలోనే మృతదేహం ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ స్థలంలో ఆధారాల కోసం దర్యాప్తు చేపట్టారు.ఇదిలా ఉంటే ఓ లారీలో సంచిలో మనిషి చేయిని పోలీసులు గుర్తించారు. 

Latest Videos

వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి లారీని తనిఖీ చేస్తే సంచిలో సగం నరికిన చేయి లభించింది. లారీ డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆస్తి వివాదాలా, వివాహేతర సంబంధంతో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మృతుడి వయస్సు 30 నుండి 35 ఏళ్ల వయస్సు ఉంటుంది. సంచిలో నరికిన చేయిని తరలికిస్తున్న నిందితులను పోలీసులు ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పారు. అంతేకాదు తమ పేర్లు కూడ సరిగా చెప్పలేదని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనే విషయాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

click me!