గుడివాడ వెళ్తుండగా బీజేపీ నేతల అడ్డగింత.. పోలీసులతో సోము వీర్రాజు వాగ్వాదం

By Siva KodatiFirst Published Jan 25, 2022, 2:22 PM IST
Highlights

గుడివాడ (gudivada) వెళ్తున్న ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము  వీర్రాజును (somu verraju) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగి బీజేపీ నేతలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ దశలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

గుడివాడ (gudivada) వెళ్తున్న ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము  వీర్రాజును (somu verraju) పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారు దిగి బీజేపీ నేతలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ దశలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకోవడం ఏంటని సోము వీర్రాజు పోలీసులపై మండిపడ్డారు. 

కాగా.. గుడివాడలో మంత్రి కొడాలి నానికి (kodali nani) చెందిన కే కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (telugu desam party) ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు గత శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు వచ్చారు. క్యాసినో  నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 

casino నిర్వహించిన కె కన్వెన్షన్ సెంటర్ వద్దకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకొన్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నేతలు నిలువరించారు.అయితే ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యాలయం వెనుక నుండి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు కుర్చీలు, రాళ్లతో దాడి వేశారు. వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు,. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. 
 

click me!