టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Published : Jun 06, 2023, 01:15 PM IST
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వినూత్న నిరసన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు వినూత్న నిరసన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు. దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే రామనాయుడు.. నిన్న రాత్రి పెరుగులంక గోదావరి ఏటిగట్టు పైన ధర్నాకు దిగారు. బాధితులతో ఏటిగట్టు వద్ద రాత్రి బస చేశారు. రాత్రి అందరితో కలిసి అక్కడే భోజనం చేశారు.  ఈ రోజు ఉదయం పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేశారు. దళితులతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు.  ఎన్ని రోజులైనా దళితులకు అండగా ఉంటానని చెప్పారు. 

అయితే ఈరోజు ఉదయం పోలీసులు నిమ్మల రామనాయుడుని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత  చోటుచేసుకున్నారు. నిమ్మల రామనాయుడును పోలీసులు అరెస్ట్ చేయకుండా.. ఆయన అనుచరులు, దళితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

అయితే పోలీసులు ఎమ్మెల్యే రామానాయుడిని బలవంతంగా అదుపులోకి తీసుకుని.. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ పరిణామాలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి.  
 

PREV
click me!

Recommended Stories

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత | Anam Ramanarayana Reddy | Tirupati Independence Day
స్వాతంత్య్ర వేడుకల్లో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Nara Lokesh Independence Day Speech 2026