వివాహితపై అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

Published : May 22, 2020, 07:59 AM ISTUpdated : May 22, 2020, 08:06 AM IST
వివాహితపై అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

సారాంశం

ముమ్మిడివరం మండలంలో ఓ గ్రామానికి చెందిన వివా హితను భర్త వదిలివేయడంతో ఎనిమిదేళ్ల పాపతో కలిసి విడిగా ఉంటోంది. అదే మండలంలోని చినకొత్తలంక గ్రా మానికి చెందిన ముదునూరి రంగబాబు 2019, ఏప్రిల్‌ నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆమెకు అప్పటికే పెళ్లై ఓ కుమార్తె కూడా ఉంది. కానీ భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆమె అతనికి దూరమై బిడ్డతో ఒంటరిగా జీవిస్తోంది. కాగా.. ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి కన్నేశాడు. ఓ రోజు కాపుకాసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి.. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే.. కులం పేరుతో దూషించాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముమ్మిడివరం మండలంలో ఓ గ్రామానికి చెందిన వివా హితను భర్త వదిలివేయడంతో ఎనిమిదేళ్ల పాపతో కలిసి విడిగా ఉంటోంది. అదే మండలంలోని చినకొత్తలంక గ్రా మానికి చెందిన ముదునూరి రంగబాబు 2019, ఏప్రిల్‌ నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ విషయం బయటకు చెప్పకుండా ఉంటే పెళ్లి చేసుకుంటానని, లేక పోతే చంపుతానని బెదిరించాడని పోలీసులకు బాధితురా లు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పలుమార్లు అత్యా చారానికి పాల్పడ్డాడని, తనను పెళ్లి చేసుకోమని అతడిని ఇటీవల అడగ్గా కులం పేరుతో దూషించి అవమాన పరిచాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిపై అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?