వివాహేతర సంబంధం.. హత్య కేసు ఛేదించిన పోలీసులు

Published : May 08, 2019, 04:36 PM ISTUpdated : May 08, 2019, 04:57 PM IST
వివాహేతర సంబంధం.. హత్య కేసు ఛేదించిన పోలీసులు

సారాంశం

కర్నూలులో  రెండు నెలల క్రితం  ఓ మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఆ కేసును పోలీసులు చేధించారు. హత్యకు గల వివరాలను పోలీసులు బయటపెట్టారు. నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

కర్నూలులో  రెండు నెలల క్రితం  ఓ మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఆ కేసును పోలీసులు చేధించారు. హత్యకు గల వివరాలను పోలీసులు బయటపెట్టారు. నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జూపాడు బంగ్లా మండలం, పారుమంచాల గ్రామానికి చెందిన ప్రేమరాజు.. అదే గ్రామానికి చెందిన జుబేదాబీకి మధ్య వివాహేతర సంబంధం ఉంది. తర్వాత కొన్ని నెలలకు జుబేదాబి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. కాగా... కొంతకాలానికి ప్రేమరాజు మళ్లీ తారసపడటంతో అతనితో జుబేదాబి వివాహేతర సంబంధం కొనసాగించింది. 

వీరి సంబంధంలో భాగంగా ప్రేమరాజు జుబేదాబీ వద్ద రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. ఫిబ్రవరి 25వ తేదీన జుబీదాబీ తన అత్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడికి ప్రేమరాజును రప్పించుకొని.. డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేసింది. మరుసటి రోజు ఇస్తానని చెప్పి 26వ తేదీన జుబేదాబీని ప్రేమరాజు తన గదికి రమ్మన్నాడు.

 డబ్బులు ఇవ్వలేని ప్రేమరాజు ఆమెను చంపాలని పథకం వేశాడు. ఆరోజు మధ్యాహ్నం ప్రేమరాజు ఇంట్లో జుబేదాబీ గడిపింది. నిద్రపోతున్న జుబేదాబీని ప్రేమరాజు మెడకు నైలాన్‌ తాడు బిగించి చంపేశాడు. ఒక్కడే మృతదేహాన్ని మోసుకెళ్లలేక ముక్కలు ముక్కలుగా నరికి సంచుల్లో మూటలుగా కట్టాడు. అదే రోజు రాత్రి నుంచి మూడు రోజుల పాటు మృతదేహ శరీర భాగాలున్న మూటలను ఒక్కొక్కటిగా కేసీలో పడేశాడు. ఆ తర్వాత స్వామిరెడ్డి నగర్‌ నుంచి పరారయ్యాడు.

కాగా.. మృతదేహం శరీర భాగాలను గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వారు కేసును సవాలుగా తీసుకొని విచారణ చేపట్టారు. చివరకు నిందితుడిని పట్టుకున్నారు. తానే  చంపానని ప్రేమ్ రాజు కూడా అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu