మహిళతో సహజీవనం.. పెళ్లి చేసుకోమన్నందుకు గొంతు కోసి పరార్.. పల్నాడు ఘటన నిందితుడి అరెస్ట్..

Published : Apr 18, 2022, 07:12 AM IST
మహిళతో సహజీవనం.. పెళ్లి చేసుకోమన్నందుకు గొంతు కోసి పరార్.. పల్నాడు ఘటన నిందితుడి అరెస్ట్..

సారాంశం

గుంటూరు జిల్లాలో అంబేద్కర్ జయంతి నాడు యువతిపై దాడి కేసులో నిందితుడిని సత్తెనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తేనని తేల్చారు. పెళ్లి చేసుకోమన్నందుకు దారుణానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. 

గుంటూరు : palnadu జిల్లాలో ఇటీవల ఓ యువతి గొంతు కోసి పారిపోయిన నిందితుడు తులసీరామ్ ను సత్తెనపల్లి పోలీసులు arrest చేశారు. పల్నాడుజిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ… దాచేపల్లికి చెందిన Sheikh Fatima భర్తతో విడిపోయి గత ఆరు నెలల నుంచి సత్తెనపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో Janasena Office ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. కొంతకాలంగా గురజాలకు చెందిన తులసీరామ్ తో ఆమె సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని తులసిరామ్ ను కోరింది. 

ఈ విషయంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఫాతిమా ఎంత చెప్పినా వినకపోవడంతో  ఆవేశంతో ఉన్న తులసిరామ్ ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఆ రోజు అంబేద్కర్ జయంతి కావడంతో తాలూకా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పార్టీ కార్యాలయానికి వస్తుండగా రోడ్డుపై రక్తపు మడుగులో ఉన్న ఫాతిమాను గమనించారు. వెంటనే స్పందించిన జనసేన నాయకులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు.  

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సత్తెనపల్లి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తులసి రామ్ కోసం బృందాలుగా ఏర్పడి  గాలించారు. పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  ప్రస్తుతం యువత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అని ఎస్పీ వివరించారు.  హత్యాయత్నం జరిగిన 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న సత్తనపల్లి డిఎస్పి విజయ భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు. 

కాగా,  పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో యువతి సహజీవనం చేస్తున్న ప్రియుడి చేతిలో హత్యాయత్నానికి గురయిన ఘటన ఏప్రిల్ 14న జరిగింది. ప్రియురాలిపై అనుమానం పెరిగి పెనుభూతంగా మారడంతో నడిరోడ్డుపైనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. రక్తపుమడుగులో పడివున్న యువతిని జనసేన పార్టీ నాయకులు గుర్తించి హాస్పిటల్కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రియుడి చేతిలో కత్తిపోట్లకు గురై గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న యువతిని శుక్రవారం నాడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరిమర్శించారు. డాక్టర్లను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.  

అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. దుర్మార్గుడి చేతిలో ఫాతిమా తీవ్రంగా గాయపడిందని మెడపైన కత్తితో దాడి చేయడంతో లోతైన గాయమైందని తెలిపారు. డాక్టర్లు దాదాపు 5 గంటలపాటు చికిత్స చేసి ప్రాణాలు కాపాడాలని అన్నారు ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు వైద్యం విషయంలో కుటుంబ సభ్యులు బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆమె త్వరగా కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వెల్లడించారు.అంతేకాదు పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని వాసిరెడ్డి పద్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu