తలకు విగ్గుపెట్టుకొని అందంగా ముస్తాబై.. ఫేస్ బుక్ లో..

Published : Jun 12, 2020, 09:10 AM IST
తలకు విగ్గుపెట్టుకొని అందంగా ముస్తాబై.. ఫేస్ బుక్ లో..

సారాంశం

ఓ యువకుడు ఫేస్ బుక్ లో దాదాపు పది మంది అమ్మాయిలను మోసం చేశాడు. అందుకోసం తాను విగ్గుపెట్టుకొని అందంగా ముస్తాబై దారుణంగా మోసం చేశాడు.

సోషల్ మీడియాలో కేటుగాళ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి మోసం చేయడానికి ఎంతటి ప్లాన్ అయినా వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ఫేస్ బుక్ లో దాదాపు పది మంది అమ్మాయిలను మోసం చేశాడు. అందుకోసం తాను విగ్గుపెట్టుకొని అందంగా ముస్తాబై దారుణంగా మోసం చేశాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఆవుజ రాజ్‌కుమార్‌ డిగ్రీ చదివి ఆర్‌ఎంపీగా పనిచేస్తుండేవాడు. ఇతడికి బట్టతల. అయితే విగ్గు పెట్టుకుని.. తేజ, తేజర్షి, సంతో్‌షరెడ్డి, సల్మాన్‌రాజ్‌, హ్యాపీ, అర్జున్‌ అనే మారుపేర్లతో.. ఫేస్‌బుక్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకునేవాడు. మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో వారిని బ్లాక్‌మెయిలింగ్‌ చేసి, లైంగికంగా లోబరుచుకునేవాడు.

ఆపై నగలు, నగదు లాక్కునేవాడు. హైదరాబాద్‌, బెంగళూరు, నంద్యాల, కర్నూలు, పత్తికొండ ప్రాంతాల్లో అమ్మాయిలను మోసం చేసినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ చెప్పారు. రాజ్‌కుమార్‌ కడప జిల్లా రాజుపాలెంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లీజుకు తీసుకుని నడుపుతున్నాడు. దానిలో పనిచేసే టీచర్‌ను ఈ ఏడాది మార్చిలో చిలకలూరిపేట సమీపంలోని గ్రామంలో ఇంటిలో నిర్భందించి, హింసించాడు. అతడి బారినుంచి తప్పించుకుని వచ్చిన యువతి ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
 

PREV
click me!

Recommended Stories

Yarlagadda Venkata Rao Slams Jagan Mohan Reddy | AP Development | TDP VS YCP | Asianet News Telugu
సరుకు, సామాన్లు పదాలు బూతులుగా ఎందుకు మారాయి? | Telugu Explainer | Asianet News Telugu