విజయవాడ- చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. జూలై 7న వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ..

Published : Jul 04, 2023, 10:12 AM IST
 విజయవాడ- చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. జూలై 7న వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది.  విజయవాడ - చెన్నైల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జూలై 7వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది.  విజయవాడ - చెన్నైల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జూలై 7వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. విజయవాడ, చెన్నై నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత క్రమబద్ధీకరించనుంది. ఈ  రైలు విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నైకి చేరుకోనుంది. తిరిగి అదే మార్గం చెన్నై నుంచి విజయవాడకు చేరుకోనుంది. ఇక, విజయవాడ నుంచి తిరుపతి మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా.. రేణిగుంట జంక్షన్ మీదుగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినట్లు తెలిసింది. 

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడం వల్ల విజయవాడ-చెన్నై మార్గంలో రద్దీని కొంతవరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఏపీ- తెలంగాణల మధ్య.. రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం- సికింద్రాబాద్, సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రెండు సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించిందని రైల్వే అధికారులు తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!