పార్టీ నేతలతో పవన్ భేటీ: ఈ నెల 17న మూడు జిల్లాల నేతలతో జనసేనాని భేటీ

Published : Nov 15, 2020, 03:53 PM IST
పార్టీ నేతలతో  పవన్ భేటీ: ఈ నెల 17న మూడు జిల్లాల నేతలతో జనసేనాని భేటీ

సారాంశం

సినిమా షూటింగ్ లతో బిజి బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలపై మళ్లీ కేంద్రీకరించారు. ఈ నెల 17వ తేదీన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

అమరావతి: సినిమా షూటింగ్ లతో బిజి బిజీగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలపై మళ్లీ కేంద్రీకరించారు. ఈ నెల 17వ తేదీన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జనసేనాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ నెల 17వ  తేదీన కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితితో పాటు ఇతర పార్టీల స్థితిగతులపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు.

ఈ నెల 18వ తేదీన అమరావతి పోరాట సమితి, అమరావతి మహిళా నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.అమరావతిలోనే రాజధాని కొనసాగాలని జనసేన కోరుకొంటుంది. గతంలో అమరావతి రైతులకు పవన్ కళ్యాణ్ గతంలో మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు సుమారు 300 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్