విజయవాడ కనకదుర్గ ఆలయంలో వారాహి వాహనం: ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్

By narsimha lode  |  First Published Jan 25, 2023, 10:15 AM IST

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని  జనసేన  చీఫ్  పవన్ కళ్యాణ్  సందర్శించుకున్నారు. 


విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్    బుధవారం నాడు  విజయవాడ కనకదుర్గ అమ్మవారిని  సందర్శించుకున్నారు.  ఇంద్రకీలాద్రి  కనకదుర్గమ్మ ఆలయంలో  వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్  ప్రత్యేక పూజలు నిర్వహించారు.   నిన్న తెలంగాణ రాష్ట్రంలోని  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో  పవన్ కళ్యాణ్  ప్రత్యేక పూజలు చేశారు. తన వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు. ఏపీ రాష్ట్రంలో  త్వరలోనే  పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్నారు. వారాహి వాహనాన్ని తన  బస్సు యాత్ర కోసం  పవన్ కళ్యాణ్  వారాహి  వాహనాన్ని  సిద్దం చేసుకున్నారు.  

గత ఏడాది  అక్టోబర్ మాసంలో  బస్సు యాత్ర  చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే  రాష్ట్ర వ్యాప్తంగా జనవాణి కార్యక్రమాలు పూర్తి కానందున   బస్సు యాత్రను ఈ ఏడాదికి వాయిదా వేశారు.బస్సు యాత్ర ను వాయిదా వేస్తున్నట్టుగా  గత ఏడాది సెప్టెంబర్ మాసంలో  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే  బస్సు యాత్ర  ఎప్పటి నుండి ప్రారంభిస్తారనే విషయమై  త్వరలోనే  పవన్ కళ్యాణ్  ప్రకటించే అవకాశం ఉంది.  

Latest Videos

undefined

ఏపీ రాష్ట్రంలో  వచ్చే ఎన్నికల్ో వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో  పవన్ కళ్యాణ్   ముందుకు వెళ్తున్నారు.  ఈ మేరకు  టీడీపీ తో పాటు  ఇతర పార్టీలతో కలిసి  కూటమిని ఏర్పాటు  చేయాలనే యోచనలో  జనసేన పార్టీ ఉంది.  ఏపీతో పాటు  తెలంగాణ రాష్ట్రంలో  కూడా  వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది.  

2019 ఎన్నికల్లో  జనసేనకు కేవలం  ఒక్క స్థానం మాత్రమే దక్కింది.  పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్  ఓడిపోయారు.   గత ఎన్నికల సమయంలో  విపక్షాలు విడివిడిగా  పోటీ చేయడం వల్ల  వైసీపీకి కలిసివచ్చిందని   జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.  
 
 

click me!